ఈసారైనా నామినేటెడ్ పదవులు లభించేనా?
- అసెంబ్లీ టికెట్ల సమయంలో నాయకులకు హామీ
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురుచూపులు
- అదిగో... ఇదిగో అంటూ కాలయాపన
- ఎదురుచూపులతో ఆశావహుల కళ్ళు కాయలు
మేడ్చల్, అక్టోబర్ 21(విజయక్రాంతి): నామినేటెడ్ పదవుల పందేరం(Distribution of Nominated Posts) విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర జాప్యం చేస్తుండడంతో ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. పదవుల పంపిణీ విషయములో ఇదిగో... అదిగో అంటూ తీవ్ర జాప్యం చే స్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 34 నెలలు అవుతుంది. అప్పటినుంచి పలువురు నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఎదురుచూసి కళ్ళు కాయలు కా స్తున్న పదవులు రావడం లే దు. దీంతో చాలామంది నా యకులు పదవులపై ఆశలు వ దులుకున్నారు. ఇంకా రెండేళ్ల స మయం ఉంది, ఇక తమకు పదవులు రావని లోలోపల అసంతృప్తితో ఉన్నారు. నేతలు అసంతృప్తి, అసహనం రాకుండా ద సరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది అంటూ ఇండియాకు కేకులు ఇస్తున్నారు.
తాజాగా దీపావళికి పదవుల పందేరం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక నామినేటెడ్ పదవులు ఖాళీ అయ్యా యి. అందులో ఐదు ఆరు పాత వారికి ఇచ్చి, మిగతా వాటిని కొత్తవారికి ఇస్తారని అంటున్నారు. పదవుల సంఖ్య ఎక్కువగా ఉండ డంతో తమకు ఈసారైనా పదవి వస్తుందనే ఆశతో జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఉన్నారు.
మేడ్చల్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు నాయకులు టికెట్ల కోసం పోటీపడ్డారు. టికెట్లకు పోటీ ఉండడంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. ఇతర పార్టీలకు చెందిన వారిని సైతం పార్టీలో చేర్చుకున్నారు. వీరిలో చాలామందికి ఇప్పటివరకు న్యా యం చేయలేక పోయారు.
అంతేగాక వారి ఉనికి ప్రస్తుతం పార్టీలో ప్రశ్నార్థకమైంది. మేడ్చల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆ యన కుమారుడు శరత్ చంద్రారెడ్డి బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడత లోనే సుధీర్ రెడ్డికి ఏదో ఒక పదవి రావాలి. కానీ ఇంతవరకు రాలేదు.
డిసిసి మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ ఈయనకు టికెట్ దక్కలేదు. ప్రభుత్వం వచ్చి న తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చా రు. హామీని నెరవేర్చక పోవడమే గాక డిసిసి అధ్యక్ష పదవి కూడా రెన్యువల్ చేయలేదు. మరో నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ కు కూడా ఇంతవరకు ఏ పదవి రాలేదు.
కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికలకు ఏడాది ముందు నుంచి టికెట్ తనకే వస్తుందని నమ్మకంతో ఎంతో ఖర్చు చేసుకున్న నర్సారెడ్డి భూపతిరెడ్డికి అసలు సమయంలో టికెట్ ఇవ్వలేదు. కనీసం నామినేటెడ్ పదవి కూడా ఆయనకు దక్కలేదు. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన శ్రీరంగం సత్యం కూడా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు.
బొంతు రామ్మోహన్ కు ఆర్టిసి పదవి అంటూ ప్రచారం
బొంతు రామ్మోహన్ ఒకప్పుడు బి ఆర్ ఎస్ లో కీలక నాయకుడు. పార్టీ అధినేత కేసిఆర్ కు సన్నిహితుడు. ఉద్యమంలో యువజన నేతగా కెసిఆర్ తో కలిసి పాల్గొన్నారు. బి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్గా ఎన్నికయ్యారు. కానీ అనూహ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బి.ఆర్.ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇవ్వడంతో పార్టీ మారినట్లు తెలిసింది. కానీ అసలు సమయంలో మొండి చేయి ఇచ్చారు. రెండేళ్ల నుంచి న్యాయం చేస్తామంటున్నారేగా ని చేయడం లేదు. ఇటీవల ఆయన పేరు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వినిపిస్తోంది. త్వరలోనే బొంతు రామ్మోహన్ కు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ ఆయన అనుచరులు అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ లో చేరిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కూడా నామినేటెడ్ పదవి లేదా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. వీరిలో ఎంతమందికి పదవులు వస్తాయో వేచి చూడాల్సిందే!