అమ్మవారిగా లయ

22-10-2026 | 05:46am

యాక్షన్, అడ్వెంచర్, యాక్షన్ జానర్‌లో సరికొత్త కథతో లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్రధాన పాత్రల్లో రాగ మూవీస్ అండ్ తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’(Son of Kanakadurgamma). ఈ మూవీకి దుర్గ ఫణిదర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కాకర్ల గోవర్దనరావు కథను అందించారు.

దసరా సందర్భంగా ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, స్వప్నదత్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో అమ్మవారిగా లయ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. సన్ ఆఫ్ కనకదుర్గమ్మ సినిమాని నిధి అన్వేషణ అనే కాన్సెప్ట్ మీద తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రానికి శశిధర్ లంక సంగీతాన్ని అందిస్తుండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సామ్ కే ప్రసన్ అందించారు. ప్రసాద్ కేవీ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. రాజేశ్ లంక ఈ మూవీకి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకి రాఘవేందర్ రెడ్డి ఎడిటర్‌గా, చైతన్య మీనవల్లి, ప్రసాద్ కేవీ డైలాగ్స్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు