డ్రగ్స్‌తో పిల్లల భవిష్యత్తు నాశనం

25-11-2026 | 11:48am

నషా ముక్త్ భారత్ కోసం అందరూ భాగస్వాములు కావాలి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: మాదకద్రవ్యాల(Drug) మత్తులో యువత భవిష్యత్తు అంధకారమవుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(Union Minister G. Kishan Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియా మన పిల్లలను వ్యసనాలకు బానిసలుగా మార్చి కుటుంబాలకు, సమాజానికి దూరం చేస్తోందని పేర్కొన్నారు. యువతను ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన నషా ముక్త్ భారత్ సాధన(Nasha Mukt Bharat campaign)లో భాగంగా హైదరాబాద్‌లో మూడు రోజులపాటు అవగాహన పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు.

ఈ ఉద్యమం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఈ కార్యక్రమానికి రావడం ఉద్యమానికి మరింత ప్రోత్సాహాన్నిస్తుందని, డ్రగ్స్‌పై సాగిస్తున్న పోరాటం ప్రజల భాగస్వామ్యంతో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


మరిన్ని వార్తలు