గచ్చిబౌలి హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం.. ఆరుగురికి పాజిటివ్

25-11-2026 | 01:24pm

హైదరాబాద్: ఐటీ కారిడార్‌లోని పీజీ హాస్టళ్ల(Gachibowli PG Hostel Raid)లో గంజాయి వినియోగంపై ఈగల్ ఫోర్స్(Eagle Force) నిఘా పెంచింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ మెన్స్ పీజీ హాస్టల్‌లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఎనిమిది మందికి డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో ఆరుగురికి గంజాయి వినియోగానికి సంబంధించిన THC పాజిటివ్‌గా వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు.

సోదాల సందర్భంగా హాస్టల్‌లో 15 గ్రాముల గంజాయిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. గంజాయి సరఫరా చేస్తున్నారనే అనుమానంతో ముగ్గురిని గుర్తించి దర్యాప్తు చేపట్టారు. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోని పీజీ హాస్టళ్లపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. హాస్టళ్లలోకి వచ్చిపోయే వ్యక్తులు, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు సమాచారం. డ్రగ్స్ వినియోగం, సరఫరా నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు