గార్లలో కలెక్టర్ విస్తృత తనిఖీలు.. భూ రీ సర్వేపై ఆరా
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ బుధవారం గార్ల మండలంలో విస్తృతంగా పర్యటించారు. గోపాలపురంలో నిర్వహిస్తున్న భూముల రీ సర్వే (Land Resurvey), ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Family Life Insurance) పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ రీ సర్వేను వేగంగా, పారదర్శకంగా (Transparency) పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులు సమన్వయంతో (Coordination) పనిచేయాలని సూచించారు. రైతులకు ముందస్తుగా సమాచారం అందించిన తర్వాతే సర్వే ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేశారు