రూ.10 లక్షల నగదు బూడిద
25-11-2026 | 10:43am
నిర్మల్: బాసర(Basara)లోని రవీంద్రపూర్ కాలనీలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. షార్ట్ సర్క్యూట్(Short Circuit) కారణంగా ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఇంట్లో దాచిన సుమారు రూ.10 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం, వెండి, విలువైన పత్రాలు కాలిపోయాయి. కుమార్తె పెళ్లి కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్, బట్టలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.