రేపే ఖాతాల్లోకి నగదు

25-11-2026 | 09:37am

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) సందర్భంగా కొత్త పింఛన్‌దారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనుంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట(Achampet)లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

4.75 లక్షల మందికి కొత్త పింఛన్లు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4,63,857 మందికి చేయూత పింఛన్లు(Cheyutha Pensions) మంజూరు చేసింది. తాజాగా ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులకు మరో 11,275 పింఛన్లు ఆమోదించింది. దీంతో కొత్తగా మంజూరైన పింఛన్ల సంఖ్య 4,75,132కు చేరింది. వీరందరికీ నవంబర్ 26న నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

సాధారణ కేటగిరీ లబ్ధిదారులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున పింఛన్ అందనుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితర అర్హులకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా లభించనుంది.

కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు

ఇదే వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీ(Distribution of Indiramma sarees)ని కూడా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మందికి, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మందికి చీరలు పంపిణీ చేయనున్నారు.

రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలు ఇందిరమ్మ చీరలు పొందేందుకు అర్హులు. గ్రామాలు, పట్టణ వార్డుల వారీగా సెర్ప్ సిబ్బంది పంపిణీ చేపట్టనున్నారు. అర్హులు రేషన్ లేదా ఆహార భద్రత కార్డు, ఆధార్ వివరాలు చూపించి చీరలు తీసుకోవచ్చు. ఈ రెండు సంక్షేమ కార్యక్రమాలను ఒకే రోజు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు