ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు
25-11-2026 | 01:48pm
మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) మణుగూరులో రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. స్టీరింగ్ పట్టేయడంతో అదుపుతప్పిన విద్యార్థుల కారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు(RTC Bus)ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఉన్న మరో ముగ్గురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను వెంటనే కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.