పుష్కరఘాట్ పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
25-11-2026 | 10:26am
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి నది తీరంలో జరుగుతున్న పుష్కరఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని మంత్రి అన్నారు. మంథనికి అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీఐ విద్యాసంస్థను తీసుకొచ్చామని, భవన నిర్మాణం పూర్తికాగానే త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.