స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్

25-11-2026 | 02:13pm

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు(Indian Stock Markets) భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్ల జోరు కనిపించడంతో ప్రధాన సూచీలు రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. ఒక దశలో బీఎస్ఈ సెన్సెక్స్(BSE Sensex) 2,000 పాయింట్లకు పైగా ఎగబాకి 84,498.21 స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ(NSE Nifty) సైతం 500 పాయింట్లకు పైగా పెరిగి 25,900 మార్కును అందుకుంది.

మధ్యాహ్నం 12.50 గంటల సమయానికి సెన్సెక్స్ 1,339.08 పాయింట్ల లాభంతో 83,775.07 వద్ద, నిఫ్టీ 383 పాయింట్ల పెరుగుదలతో 25,733.20 వద్ద కొనసాగింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి.

సెన్సెక్స్ 30లో టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ మినహా మిగిలిన షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ముడిచమురు ధరల తగ్గుదల కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. దీంతో ఇన్వెస్టర్లలో కొనుగోళ్ల ఉత్సాహం నెలకొంది.

మరిన్ని వార్తలు