పెన్షన్ల ఆధారాలివిగో.. రాజీనామా చెయ్
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ సవాల్
ఆయనకు రీల్స్‌మీదే శ్రద్ధ పేదలకిచ్చే పెన్షన్ల మీద లేదు
ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తే బయట తీరగనీయమని హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) అనే వ్యక్తి రాక్షస పక్షి అని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్(Konagala Mahesh) వ్యాఖ్యానించారు. గడీల దొరల మెప్పుకోసం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లపై(Pensions) కౌశిక్ రెడ్డి ఊరుకుక్కలా మొరుగుతున్నాడని ఘాటుగా విమర్శించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు(KTR) కౌశిక్ రెడ్డి బాడీగార్డు అని కొనగాల దుయ్యబట్టారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
లక్కీ లాటరీలో ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డికి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న కొత్త పెన్షన్లపై లేదన్నారు. అర్హత లేని వాడిని అందలం ఎక్కిస్తే ఎట్లా ఉంటదో కౌశిక్ రెడ్డి బెస్ట్ ఎగ్జామ్ ఫుల్ అని, కౌశిక్ రెడ్డి లాంటి ఐటెమ్ గాడిని ఎక్కడ చూడలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘దొరల మెప్పు పొందాలంటే వాళ్ళ బూట్లు నాకు.. కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తానంటే బయట తిరగనీయం’ అని హెచ్చరించారు. అర్హులైన వారందరికీ ప్రజా ప్రభుత్వం 6,28,132 పెన్షన్లు మంజూరు చేసిందని, ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 17967 కొత్త పెన్షన్లు వచ్చాయని కొనగాల తెలిపారు.
హుజురాబాద్‌లో 4,397 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డి సొంతూరు వీణవంకలో 28 కొత్త పెన్షన్ల మంజూరు పత్రాలను ఆయనే ఇచ్చారని, మీడియా సమావేశంలో మాత్రం ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అంటున్నారని కొనగాల తెలిపారు. అన్ని ఆధారాలు ఇప్పుడు ప్రజల ముందు పెట్టామని, కౌశిక్ రెడ్డి మొగోడయితే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
లేందంటే హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్‌రెడ్డి పెన్షన్లపై అవగాహన లేని దద్దమ్మ అని, కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితానికి పాడే కట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. నిత్య దరిద్రులు, నిత్య అబద్ధాలకోరులను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ కార్యకర్త ముందుకు నడవాలన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.