గుజరాత్‌లో డివైడర్‌పై దూసుకెళ్లి మంటలు!

25-11-2026 | 10:52am

కచ్: గుజరాత్‌లోని కచ్ జిల్లా భాచౌ సమీపంలో ప్రమాదం(Accident) చోటుచేసుకుంది. మోతీ చిరాయ్(Moti Chirai) వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఓ ట్రైలర్ రోడ్డు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. సుమారు 50 మీటర్ల దూరం డివైడర్‌పైనే ప్రయాణించిన అనంతరం వాహనంలో మంటలు(Fire) చెలరేగాయి. సమాచారం అందుకున్న భాచౌ మున్సిపాలిటీ(Bhachau Municipality) అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు