భారీ నష్టాల నుంచి బౌన్స్ బ్యాక్
25-11-2026 | 10:14am
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 1,400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 400 పాయింట్లకు చేరువలో లాభపడటంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. గత సెషన్లో నమోదైన భారీ నష్టాల నుంచి మార్కెట్లు కోలుకున్నాయి.
విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ముడి చమురు ధరల తగ్గుదల మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇన్ఫోసిస్ సహా పలు ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ భారత మార్కెట్లు మాత్రం భారీ ర్యాలీ కొనసాగిస్తున్నాయి.