అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు

03-11-2026 | 05:51pm

భీమారం (చెన్నూర్), (విజయక్రాంతి) : కావ్‌ క్రాంతి పథకంలో(Cow Revolution Scheme) భాగంగా మంచిర్యాల జిల్లాలో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసిన పత్తి పంటలను జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) ఎల్తూరి సురేఖ(District Agriculture Officer (DAO) Elturi Surekha) నాగ్‌పూర్ నుంచి వచ్చిన సీనియర్ శాస్త్రవేత్త ప్రియాంక గైక్వాడ్ లతో కలిసి పరిశీలించారు. మంగళ వారం మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజిపల్లి గ్రామంలోని అధిక సాంద్రత పత్తి క్షేత్రాన్ని వారు సందర్శించారు.

అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసిన తీరును, పంట పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ పద్ధతి ద్వారా ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెప్పడంతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతి రైతు కూడా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసి అధిక దిగుబడి సాధించాలని సూచించారు.

ఖాజిపల్లి గ్రామంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగును సందర్శించి, రసం పీల్చే పురుగులను నివారించే మందులను మ్యాపికాటో క్లోరైడ్ తదితర వాటిని తప్పకుండా వాడాలని సూచించారు. మొక్కల ఎదుగుదలను నియంత్రిస్తూ 24000 మొక్కల ద్వారా ప్రతి మొక్కకు పది నుంచీ పదిహేను కాయలు కాసినా కూడా 10 నుండి 15 క్వింటాళ్లు దిగుబడి రావడానికి అవకాశం ఉందని తెలిపారు.

ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, వచ్చే సంవత్సరంలో వాన కాలంలో అధిక దిగుబడి నిచ్చే ఈ పద్ధతిలో పత్తి పంటను వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్, ఏడీఏ బానోత్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్, వ్యవసాయ విస్తరణ అధికారులు జి విశ్వేశ్వర్నాథ్ రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు