అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల కృషి అభినందనీయం

03-11-2026 | 05:51pm

ఆసిఫాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అన్నారు. మంగళవారం రెబ్బెన మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుల నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల చదువుతో పాటు కంప్యూటర్ తరగతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి, విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపిస్తూ వారి విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

మరిన్ని వార్తలు