జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం

03-11-2026 | 05:35pm

ఆసిఫాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): తిర్యాణి మండలంలో జోనల్ స్థాయి వాలీబాల్ పోటీలు(Zonal Volleyball Tournament) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి మడావి శేకు, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సమనపల్లి బ్రహ్మం, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్సెంగా శ్రీనివాస్, ఉపాధ్యాయులు, పీడీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు