చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

26-09-2026 | 05:14pm

దీప ప్రజ్వలన చేస్తున్న TRS పార్టీ జిల్లా అధ్యక్షులు వినోద్ చారీ

వాంకిడి, (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో(Telangana Armed Peasant Struggle) వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలంగాణ రక్షణ సేన కొమురం భీం జిల్లా అధ్యక్షుడు కిర్మీళ్ల వినోద్‌చారీ(Kirmeella Vinodchari), భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ అన్నారు. శనివారం వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్‌ బుద్ధ విహార్‌లో చాకలి ఐలమ్మ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు దీప ప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనమన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో టైగర్‌ అధ్యక్షుడు కిషన్‌, అంబేద్కర్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడు దుర్గం దుర్గాజీ, ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు దుర్గం శ్యామ్‌రావు, సమాజ అధ్యక్షుడు దుర్గం లహూజీ శ్యామ్‌రావు, బౌద్ధ ఉపాసకులు పాండుజీ జాడే, అరుణ్‌, నాగ్‌సేన్‌, చునార్కర్‌ దిలీప్‌, వివేక్‌, వెంకటి, బుద్ధాజీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు