దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు

17-10-2026 | 09:19pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బూరుగూడ శివారులో ఉన్న కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం గ్రామ సర్పంచ్ సంగీత ఆలయ కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లుతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

దసరా పండుగ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంపై చర్చించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు శిరీష్ శర్మ, నాయకులు లచ్చన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు