రియల్‌టైమ్ ఫీడర్ మానిటరింగ్‌తో మెరుగైన విద్యుత్ సేవలు
ఎస్ఈ ఉత్తమ్ జాడే
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రియల్‌టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ (Real-Time Feeder Monitoring System)ను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే(Asifabad Superintending Engineer Uttam Jade) తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ సర్కిల్ పరిధిలోని మొత్తం 34 సబ్స్టేషన్లను స్కాడాతో అనుసంధానం చేసినట్లు వెల్లడించారు.
ఈ సాంకేతికత ద్వారా విద్యుత్ ఫీడర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని, అంతరాయాలు, ఓవర్‌లోడ్, వోల్టేజ్ హెచ్చుతగ్గులను తక్షణమే గుర్తించి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చని పేర్కొన్నారు. సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు విద్యుత్ సరఫరా పునరుద్ధరణను వేగవంతం చేయవచ్చన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమని ఎస్ఈ తెలిపారు.