ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ మట్టా దయానంద్
సత్తుపల్లి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని రాజీవ్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్(Congress leader Dr. Mattadayananth Vijay Kumar) స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన స్వాములకు, భవాని మాలాధారణ చేసిన భక్తులకు ఆయన స్వయంగా భిక్ష వడ్డించారు.
ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.