ఈతకల్లును అమృతంలా తాగుతున్న తొండ

30-10-2026 | 04:35pm
  1. విజయ క్రాంతి కెమెరాకు చిక్కిన ప్రకృతి వింత.. ప్రతి కల్లు చుక్కను ఆస్వాదిస్తున్న జీవి
  2. తిరుమలాయపాలెంలో ఆసక్తి రేపుతున్న దృశ్యం.. చర్చనీయాంశం

తిరుమలాయపాలెం, అక్టోబర్ 30 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల(Thirumalayapalem Mandal) పరిధిలో ప్రకృతిలో చోటుచేసుకున్న ఓ అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. సాధారణంగా మనుషులు సేవించే ఈతకల్లును ఓ తొండ ఆసక్తికరంగా తాగుతున్న దృశ్యం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈత చెట్టుకు ఏర్పాటు చేసిన బుడ్డి నుంచి కల్లు చుక్కచుక్కగా కిందకు పడుతుండగా, చెట్టు కింద ఉన్న తొండ తన నాలుకతో ఆ చుక్కలను అందుకుంటూ తాగడం చూపరులను ఆకట్టుకుంటోంది. మనుషులు ఎంతో ఇష్టంగా సేవించే ఈతకల్లును ఓ చిన్న జీవి కూడా ఆస్వాదించడం ప్రకృతిలోని వైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

సాధారణంగా చెట్లపై, పరిసర ప్రాంతాల్లో సంచరించే తొండ ఇలా కల్లు చుక్కలను తాగుతున్న దృశ్యం అరుదుగా కనిపించడంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ ఆసక్తికర దృశ్యాన్ని విజయ క్రాంతి కెమెరా బంధించింది. ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన జీవన విధానం ఉంటుందని, చిన్న జీవుల ప్రవర్తన సైతం మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

మరోవైపు వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో నీటి ప్రతి చుక్క విలువను గుర్తించి వృథాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనే సందేశాన్ని ఈ దృశ్యం గుర్తుచేస్తోంది.

మరిన్ని వార్తలు