విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌ల పంపిణీ

03-11-2026 | 04:46pm

కూసుమంచి, నవంబర్ 3 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) అనేక సంక్షేమ, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తోందని ప్రభుత్వ జూనియర్ కళాశాల కూసుమంచిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, షూస్, సాక్సులు, ఐడీ కార్డులు, బెల్టులు యూనిఫామ్‌లను కళాశాల ప్రిన్సిపాల్ బి. వీరభద్రరావు, మండల విద్యాశాఖాధికారి రావెళ్ల వీరస్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రావెళ్ల వీరస్వామి మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ప్రిన్సిపాల్ బి. వీరభద్రరావు మాట్లాడుతూ, విద్యార్థుల చదువుకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకాలు ఎంతో విలువైనవని తెలిపారు. ఉచిత విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి, యూనిఫామ్‌లను అందించడం ద్వారా ప్రభుత్వం వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు