గణేష్ మండపాలను దర్శించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య(BRS state leader Sandra Venkata Veeraiah) పలు గణేష్ మండపాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస థియేటర్ రోడ్, బైపాస్ రోడ్, తుమ్మూరు రామారావు వీధి, జూపల్లి కంటి ఆసుపత్రి రోడ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించి గణనాథునికి పూజలు చేశారు.
అనంతరం అంబేద్కర్ నగర్‌లో ముత్యాలమ్మ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
వినాయకుని ఆశీస్సులతో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని సండ్ర వెంకట వీరయ్య ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.