ఘనంగా డాక్టర్ రమాకాంత్–డాక్టర్ శిరీష నిశ్చితార్థ వేడుకలు

22-10-2026 | 08:11pm

వైరా మండలం, స్థానాల లక్ష్మీపురంలో వైభవంగా నిత్య తాంబూలాల కార్యక్రమం

వైరా. అక్టోబర్ 22.( విజయ క్రాంతి ): ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్థానాల లక్ష్మీపురం గ్రామంలో(Lakshmipuram Village) డాక్టర్ రమాకాంత్, డాక్టర్ శిరీషల నిశ్చితార్థ వేడుకలు, నిత్య తాంబూలాల కార్యక్రమం(Nitya Tambulala ceremony) గురువారం ఘనంగా నిర్వహించారు. వైదిక సంప్రదాయాల ప్రకారం వేదమంత్రాల నడుమ జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన తమటం రఘునందన్ కుమారుడు డాక్టర్ రమాకాంత్‌కు, ఖమ్మం జిల్లా వైరా మండలం స్థానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లు శేషయ్య కుమార్తె డాక్టర్ శిరీషతో నిత్య తాంబూలాల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల పెద్దలు వధూవరులను ఆశీర్వదించి,

వారి భవిష్యత్తు జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేటకు చెందిన తమటం రఘుపతి, స్థానాల లక్ష్మీపురానికి చెందిన మల్లు ప్రసాద్‌తో పాటు తమటం కృష్ణయ్య, తమటం తిరుపతయ్య, డాక్టర్ చలం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.అలాగే స్థానాల లక్ష్మీపురం గ్రామ పెద్దలు మల్లు మట్టయ్య, సర్పంచ్ నూతి వెంకటేశ్వరరావు,

తలారి నరసింహారావు, భాస్కర్ మొగులూరు సత్యం వాశెట్టి ప్రసాద్ గోపాల దాసు చెన్నయ్య సత్యనారాయణ సన్నిధి ఆంజనేయులు ఇరు కుటుంబాల బంధువులు వేడుకల్లో పాల్గొని డాక్టర్ రమాకాంత్, డాక్టర్ శిరీషలను ఆశీర్వదించారు. ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.

ఈ సందర్భంగా పెద్దలు వధూవరులు డాక్టర్ రమాకాంత్, డాక్టర్ శిరీషలను ఆశీర్వదిస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, కుటుంబాలకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. నూతన జీవితంలో పరస్పర ప్రేమానురాగాలతో ఆదర్శ దంపతులుగా నిలవాలని పెద్దలు తమ ఆశీస్సులు అందజేశారు.

మరిన్ని వార్తలు