గంగారం తండాలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
సింగరేణి నవంబర్ 9 విజయక్రాంతి: గంగారం తండా గ్రామంలో(Gangaram Thanda Village) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యకర్తలు కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి, డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు(Indiramma Houses) వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇమ్మడి మాట్లాడుతూ, నియోజకవర్గంలో శాసనసభ్యుడు రాందాస్ నాయక్ నాయకత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందడంతో లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు వెల్లివిరిసిందని తెలిపారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.