ఘనంగా విగ్రహ చాలనం

05-11-2026 | 05:48pm

ముకరంపుర, నవంబర్ 5(విజయ క్రాంతి): హనుమాన్ పునర్నిర్మాణంలో(Reconstruction of Hanuman) భాగంగా దిగ్విజయంగా విగ్రహ చాలనం జరిగింది. జ్యోతి నగర్ లోని శ్రీ హనుమాన్ సంతోషిమాత దేవాలయం(Sri Hanuman Santoshimata Temple) పునర్నిర్మాణంలో భాగంగా గురువారం ప్రముఖ పండితులు పురాణం మహేశ్వర శర్మ మరియు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో దేవాలయ ఆవరణలో ఉదయం 9 గంటల నుండి గోపూజ.

పుణ్య వచనం, అగ్ని స్థాపన, కళా ప్రదర్శన, మూల మంత్ర హోమం అనంతరం విగ్రహ చాలనం, పూర్ణాహుతి కార్యక్రమాలు కన్నుల పండువగా అత్యధిక భక్తుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీజ అజయ్, నగర్ కార్పొరేటర్లు శిల్పావేదం,  బోయిన్పల్లి ప్రవీణ్ కుమార్, వంగల పవన్, మాజీ కార్పొరేటర్లు రమణారావు, గందె మహేష్ మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు