అంతర్ గావ్ శివారులో పులి సంచారం
తాంసి/భీంపూర్,నవంబర్ 5(విజయక్రాంతి): భీంపూర్ మండలం అంతర్ గావ్ శివారులో పులి సంచారం గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తుంది... అంతర్ గావ్ శివారులో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు(Forest Department officials) సమాచారం అందించారు,అటవీ శాఖ అధికారులు వాటిని ధ్రువీకరించారు.
చెన్లకు వంటరిగా వెళ్ళవద్దని,గుంపులు గుంపులుగా వెళ్ళాలని,సాయంత్రం సమయంలో చెన్లకు వెళ్ళవద్దని అటవీ శాఖ అధికారులు గ్రామస్తులను కోరారు..కాగా పెన్ గంగా నది అడుగంటడంతో, పక్కనే ఉన్న మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయహరణం నుంచి పులులు ఇటు వైపు వస్తున్నట్టు అనుమానిస్తున్నారు..రైతులు,కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.