దండారి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్
- ఆదివాసి సాంప్రదాయాల దుస్తులు ధరించి... ఆదివాసులతో మమేకమై కోలాటం ఆడి..
- రిమ్మ గ్రామంలో గుస్సాడి ఉత్సవాల్లో పాల్గొన్న రెండవ కలెక్టర్... ఎస్పీ..
- రిమ్మలో పాల్గొన్న మూడవ ఐ టి డి ఏ పి ఓ..
- సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి...
- ప్రతి ఆదివాసి పిల్లల ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలి..
ఉట్నూర్, నవంబర్05 ( విజయక్రాంతి ): అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం రిమ్మ(Tribal village Rimma)మారుమూల గిరిజన గ్రామం(Tribal village)అయినా రిమ్మలో ఆదివాసి గోండుల సంస్కృతి(Culture of the Adivasi Gonds) సాంప్రదాయాలకు. ఆచారాలకు పెద్దపీట వేస్తారు.
మారుమూల గిరిజన గ్రామంలో ఆదివాసుల సాంప్రదాయంగా నిర్వహిస్తున్న దండారి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు, ఉట్నూర్ ఏ ఎస్ పి రిత్విక్ సాయి కుట్టే ఆదివాసి సాంప్రదాయ దుస్తులైన తెల్లని ధోతి, తెల్లని షర్టులతోపాటు రుమాల్ ధరించి ఆదివాసులతో మమేకమయ్యారు.
దండారి ఉత్సవాల సందర్భంగా ఆదివాసులు తమ సంస్కృతి సాంప్రదాయంగా ఆడుకునే కోలాటం ఆటల్లో పాల్గొని వారితోపాటు లయబద్ధంగా నృత్యం చేస్తూ.. చేతి కర్రలతో ఆడిస్తూ... అరగంటసేపు ప్రత్యేక నృత్యం చేశారు. రిమ్మ గ్రామానికి అధికారులు చేరుకోగానే గ్రామ శివారు నుండి గుస్సాడీ నృత్యాలతో ఘనంగా స్వాగతం ఇచ్చారు.
దండారి ఉత్సవాల్లో పాల్గొన్న రెండవ కలెక్టర్...
సిరికొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన రిమ్మ గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో రెండవ కలెక్టర్ గా రాజర్శి షా, రెండవ ఎస్పీగా అఖిల్ మహాజన్, మూడవ పిఓగా మంద మకరందు పాల్గొన్నారు. దండారి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన దివ్య దేవరాజన్ దండారి ఉత్సవాల్లో పాల్గొని మహిళలతో రేలా రేలా నృత్యం చేశారు.
మొదటి ఎస్పీగా విష్ణు వారియర్ దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రిమ్మ గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఐటీడీఏ పీవో గా విధులు నిర్వహించిన రెడ్డి సుబ్రహ్మణ్యం, శామ్యూల్ ఆనంద్ కుమార్ లు రిమ్మ గ్రామంలో పాల్గొని ఆ రోజుల్లో ఆదివాసులను ఉత్తేజపరిచారు...
సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి...
ఎంతో చరిత్ర కలిగిన ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలను, ఆచారాలను కాపాడుకుంటూ.. భావితరాలకు అందించడంతోపాటు పిల్లలను ఉన్నత విద్యావంతులుగా చదివించడంపై కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, పిఓ మంద మకరందు ఆదివాసులకు సూచనలు చేశారు. పండగల పేరుతో పిల్లలను ఇంటికి తీసుకువచ్చి వారి చదువులకు ఆటంకం కలిగించవద్దని సూచనలు చేశారు. వారితో పాటు అధికారులు , జిల్లా రాయి సెంటర్ సార్ మేడి తొడసం అమృతరావ్, గ్రామ పటేల్ శంకర్, ఆదివాసులు పాల్గొన్నారు.