తెలంగాణలో వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తం
హైదరాబాద్: తెలంగాణలో వర్షాల ప్రభావం క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. మురసు తుఫాను మిగిల్చిన తేమ కారణంగా గురువారం పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో Afternoon నుంచి Night వరకు ఉరుములు, మెరుపులతో కూడిన Isolated to Scattered Thunderstorms సంభవించవచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఈ ప్రభావం కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలు కాకుండా తేలికపాటి జల్లులు, స్థానికంగా ఉరుములతో కూడిన వానలు పడే సూచనలున్నాయి.
ఇతర జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాతావరణం ప్రధానంగా మేఘావృతంగా ఉండి, మధ్యాహ్నం తర్వాత తేలికపాటి వర్షం లేదా Thunderstorms వచ్చే అవకాశం ఉంది. నగరంలో భారీ వర్ష సూచనలు లేకపోయినా, ప్రయాణాల సమయంలో వాతావరణ పరిస్థితులను గమనించడం మంచిది. మురసు తుఫాను బలహీనపడి అవశేష అల్పపీడనంగా మారినట్లు IMD వెల్లడించింది. నవంబర్ 6 వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కొనసాగవచ్చని అంచనా. నవంబర్ 8 నుంచి తెలంగాణలో వాతావరణం ఎక్కువగా పొడిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
వర్షాల సమయంలో జాగ్రత్తలు: ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండకూడదు. విద్యుత్ స్తంభాలు, టవర్లకు దూరంగా ఉండాలి. వాతావరణ శాఖ తాజా Alertsను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.