చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
05-11-2026 | 05:35pm
జగిత్యాల, నవంబర్ 5 ( విజయ క్రాంతి ): జగిత్యాల పట్టణానికి చెందిన 4 గురు లబ్ధిదారులకు షాదీ ముబారక్ పథకం(Shaadi Mubarak Scheme) ద్వారా మంజూరైన 4 లక్షల రూపాయల విలువ గల చెక్కులను, ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 1,50,000 వేల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో(Jagtial MLA Camp Office) జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.