జాన్వీ, రాధికాలకు రెజీనా కౌంటర్
సినిమా ఇండస్ట్రీలో నార్త్-సౌత్ చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor), రాధికా ఆప్టే(Radhika Apte) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నటి రెజీనా కసాండ్రా(Regina Cassandra) తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. నచ్చని కథలు, పాత్రలు ఉంటే అలాంటి సినిమాలను అంగీకరించాల్సిన అవసరం లేదని రెజీనా అభిప్రాయపడ్డారు.
ఒక ప్రాజెక్ట్‌లో భాగమైన తర్వాత సినిమా పూర్తి చేసి, ఆపై ఇండస్ట్రీని తప్పుబట్టడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. సినిమా ఎంపిక విషయంలో నటీనటులకు స్వేచ్ఛ ఉంటుందని, తమకు నచ్చిన ప్రాజెక్టులనే ఎంచుకోవాలని ఆమె సూచించారు. ఇక నార్త్-సౌత్(North South Debate) అంటూ సినిమా ఇండస్ట్రీని విభజించే ధోరణిపైనా రెజీనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇలాంటి వ్యాఖ్యలు, చర్చలు పరిశ్రమలో అనవసరమైన విభేదాలకు దారితీస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు ‘కేసరి-2’ సినిమా(Kesari 2 Movie)కు సంబంధించి తన పేరు తొలగించడంపై కూడా రెజీనా ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ప్రేక్షకుల్లో చర్చకు దారితీస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై జాన్వీ కపూర్, రాధికా ఆప్టే ఎలా స్పందిస్తారో చూడాలి.