ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
జగిత్యాల, నవంబర్ 05 ( విజయ క్రాంతి ): జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మెంగు లక్ష్మీ రాజనర్సు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(Jagtial Legislator Dr. Sanjay Kumar) హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చీరను కానుకగా అందజేసి, నూతన గృహాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎం సి చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ సత్తిరెడ్డి, ధర్మారం సర్పంచ్ మల్లేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, నాయకులు పురిపాటి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గిద్దె శంకర్, నల్ల స్వామి రెడ్డి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.