బూత్ స్థాయిలో బీజేపీ బలోపేతానికి చర్యలు

31-10-2026 | 06:13pm

నవంబర్ 5న కరీంనగర్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి: తూర్పాటి రాజు

హుజూరాబాద్,(విజయక్రాంతి): బీజేపీ(BJP) సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో భాగంగా హుజూరాబాద్(Huzurabad) పట్టణంలోని 29, 47, 63వ బూత్‌లకు అధ్యక్షులను నియమించినట్లు పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు తెలిపారు. 29వ బూత్ అధ్యక్షుడిగా బెజ్జంకి రాజేందర్, 47వ బూత్ అధ్యక్షుడిగా పల్లెపు భాస్కర్, 63వ బూత్ అధ్యక్షుడిగా డొరి ఐలయ్యలను నియమించారు.

ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ... పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కమిటీలే పునాదులని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని నూతన అధ్యక్షులకు పిలుపునిచ్చారు.

అలాగే నవంబర్ 5న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల హక్కుల కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి హుజూరాబాద్ నుంచి నాయకులు, కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్‌చార్జి యాళ్ల సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గంట సంపత్, తిప్పబత్తిని రాజు, సీనియర్ నాయకులు అంకతి వాసు, డి. అశోక్, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు