ప్రజా సమస్యపై తక్షణ స్పందన – సర్పంచ్ చొరవ!
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): వెల్లుట్లపేట గ్రామంలోని బారిడి పోచం వద్ద మోటారు స్టార్టర్ రాత్రి కాలిపోవడంతో, ఉదయం ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ కొయ్యల వినోద్ రాజ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి నూతన స్టార్టర్ను తెప్పించి అందజేశారు. ప్రజల సమస్యలను గుర్తించి, ఆలస్యం చేయకుండా తక్షణ పరిష్కారం చూపుతున్న సర్పంచ్ చొరవ పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నీటిని పొదుపుగా వాడుకుందాం – భూగర్భ జలాలను కాపాడుకుందాం!
ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో, గ్రామ ప్రజలందరూ నీటిని వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే వినియోగించుకోవాలని సర్పంచ్ సూచించారు. నీటి విలువను గుర్తించి, ప్రతి నీటి బొట్టును కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు.