సరస్వతీ దేవి అవతారంలో బతుకమ్మ

17-10-2026 | 10:01pm

బాన్సువాడలో సద్దుల సంబరాలు...!

ఉమా మహేష్–స్వప్న దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పాత బాన్సువాడ(Banswada)లో సద్దుల బతుకమ్మ వేడుకలు(Saddula Bathukamma Celebrations) శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీ దేవి అవతారంలో బతుకమ్మను అలంకరించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. ఉమా మహేష్–స్వప్న దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా భక్తి భావంతో నిర్వహించిన వేడుకలు బాన్సువాడలో పండుగ వాతావరణాన్ని నింపాయి.

మరిన్ని వార్తలు