కామారెడ్డి జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలు

22-11-2026 | 06:34pm

తాడ్వాయి,నవంబర్,22( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) స్థాయి బాలురు,బాలికల కబడ్డీ క్రీడలు(Kabaddi sports for boys and girls) ఈనెల 28, 29 తేదీలలో నిర్వహించబడతాయని కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్(Kamareddy District Kabaddi Association) ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజయ్య తెలిపారు. సదాశివనగర్ మండల కేంద్రంలో ఈ క్రీడలు నిర్వహించబడతాయన్నారు. ఈ టోర్నమెంటులో విజేతలకు మొదటి బహుమతి రూ.10 వేలు, ట్రోఫీ రెండో బహుమతి రూ.5 వేలు ట్రోపి, మూడో బహుమతి రూ.2500 ట్రోపీ అందించబడతాయని తెలిపారు.ప్రతి టీం క్రీడాకారులు డ్రెస్ కోడ్ లో రావాలని ఆయన సూచించారు.ఈ క్రీడలలో పాల్గొనేందుకు 9701556631,7288021602 నెంబర్లకు ఫోన్ చేసి నమోదు చేయించుకోవాలని  ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు