అనురాగ్ లో భవనాల మరమ్మతు - ఆధునీకరణ శిక్షణా కార్యక్రమం

22-11-2026 | 06:40pm

ఘట్ కేసర్, నవంబర్ 22 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్(Anurag University Civil Engineering) విభాగం ఆధ్వర్యంలో రెహబ్ టెక్నాలజీస్  సహకారంతో  రిపేర్ రినోవేషన్ అండ్ రిఫర్బిష్మెంట్స్ ఆఫ్ బిల్డింగ్స్(Repair, Renovation, and Refurbishment of Buildings) అనే అంశంపై ఒకరోజు సాంకేతిక వర్క్‌షాప్‌ను నిర్వహించారు.

ఈకార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్తలు, ఇంజినీర్లు, నిర్మాణ రంగ నిపుణులు(Academics, engineers, and construction industry experts), పరిశ్రమ ప్రతినిధులు పాల్గొని భవనాల మరమ్మతులు, పునరుద్ధరణ, ఆధునిక నిర్మాణ సాంకేతికతలు నిర్మాణ భద్రతకు సంబంధించిన అంశాలపై తమ అనుభవాలను పంచుకున్నారు.

కార్యక్రమానికి సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్  పల్లవి బద్రి స్వాగతం పలకగా, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి. విజయ్ కుమార్ ప్రసంగించారు. రీహబ్ టెక్నాలజీస్ సీఈవో డాక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని భవనాల మరమ్మతులు, పునరుద్ధరణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతను వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎర్. సి. ఎన్. రఘు ప్రసాద్, అడిషనల్ కమిషనర్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రసంగిస్తూ భవనాల నిర్వహణ, నిర్మాణ నాణ్యత భద్రతలో ఆధునిక మరమ్మతు సాంకేతికతల ప్రాముఖ్యతను వివరించారు.

మరిన్ని వార్తలు