నెమలి అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
బాన్సువాడ, నవంబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నస్రుల్లాబాద్ మండలంలోని నెమలి గ్రామ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం(Dr. B.R. Ambedkar Youth Association, Nemali Village) నూతన కమిటీనీ ఆదివారం గ్రామంలోని అంబేద్కర్ సంఘ భవనంలో(Ambedkar Community Hall) ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బాన్సువాడ మాజీ ఏఎంసీ చైర్మన్ ఎన్. నరసింహులు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట ప్రశాంత్ కుమార్, డివిజన్ ఉపాధ్యక్షులు మన్నె చిన్న సాయిలు నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి నియామక పత్రాలు అందజేశారు.
నూతన అధ్యక్షుడుగా నీరడి ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బేగరి కామయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బేగరి శంకర్,కార్యవర్గ సభ్యులు, ఇతర నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువజన సంఘం సభ్యులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గాల(SC rights) ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఐక్యంగా నిలబడి హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని సూచించారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ సామాజిక చైతన్యం, ఐక్యతకు కృషి చేయాలని నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో నస్రుల్లాబాద్ మండల నాయకులు రెడ్డి లక్ష్మి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు దరఖాస్తుల శ్రీనివాస్, బేగరి సెంట్రింగ్ సాయిలు, నెమలి గ్రామ అంబేద్కర్ సంఘ నాయకులు బేగరి మోహన్, బేగరి సాయిలు, బేగరి బాలరాజ్, నీరడి సాయిలు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.