లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నేరేడుచర్ల, నవంబర్ 22(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల(Lions Club Nereducherla) ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఉచిత వైద్య శిబిరం(Free Medical Camp) నిర్వహించారు.క్లబ్ అధ్యక్షులు లయన్ షేక్ యూసుఫ్(Lion Sheikh Yusuf), ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ చల్లా ప్రభాకర్ రెడ్డి, డయాబెటిక్ నిపుణులు డాక్టర్ షేక్ సమీవుద్దీన్, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ నాయక్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి, గుండె, క్యాన్సర్, డయాబెటిస్(Heart disease, cancer, diabetes) తదితర వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరాలు(Free Medical Camps) నిర్వహిస్తూ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించడంలో లయన్స్ క్లబ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి సరికొప్పుల నాగేశ్వరరావు, కోశాధికారి సైదులు నాయక్, జయంతి, జీఎంటీ కోఆర్డినేటర్ లయన్ విశ్వనాథం, అడ్వైజరీ కమిటీ సభ్యులు కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, చిలకరాజు శ్రీనివాస్, వైద్య బృంద సభ్యులు సైదా, కాశీం, జ్యోతి, సరిత తదితరులు పాల్గొన్నారు.