చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

22-11-2026 | 06:31pm

మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్

ఘట్ కేసర్, నవంబర్ 22 (విజయక్రాంతి) : ఘట్‌కేసర్ డివిజన్(Ghatkesar Division) పరిధిలోని బాలాజీ నగర్‌ బస్తీ దవాఖానలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో(Pulse Polio Programme) ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్ పాల్గొని ఐదు సంవత్సరాల లోపు  చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఆమె మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు  చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పసిపిల్లల భవిష్యత్తు, ఆరోగ్య రక్షణ దృష్ట్యా పోలియో చుక్కలు వేయించడం ఎంతో ముఖ్యమైన విషయమని పేర్కొన్నారు. ఈయొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రజలను, యువకులకు ఉద్దేశించి సూచించడం జరిగింది.

మరిన్ని వార్తలు