గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి

22-11-2026 | 06:18pm

నిధులకు ఎప్పటికప్పుడు అనుమతులిస్తున్నాం.

అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.

జెండా వెంకటాపూర్ జీపీ బిల్డింగ్ ను ఎమ్మెల్యే తో కలిసి ప్రారంభించిన 

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

లక్షేట్టిపేట, నవంబర్ 22 ( విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా(Mancherial district) లక్షేట్టిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అభివృద్ధి పనులను సంబంధించిన ప్రతి అనుమతిని వీలైనంత త్వరగా ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పల్లెలు అభివృద్ధి చెందితేనే సమాజాభివృద్ధి సాధ్యమని వివరించారు.

అదే విధంగా అంగన్వాడీ భవనాలు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు లాంటి మౌళిక సదుపాయాలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. ప్రతి పౌరుడు బాధ్యతయుతంగా నడుచుకుని గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ జెండా వెంకటాపూర్ సర్పంచ్ ఎల్తాపు సుధాకర్ కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. రూ. 20 లక్షల్లో మంచి జీపి బిల్డింగ్ నిర్మించడం అభినందనీయన్నారు. గ్రామాన్ని ప్రత్యేక శ్రద్ధతో అన్ని రకాలుగా మరింతగా అభివృద్ధి చేస్తామని వివరించారు.

గ్రామానికి చెందిన సునీత మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని విన్నవించగా వెంటనే ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిచి రెండవ విడతలో ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.అంతకుముందు తిమ్మాపూర్ సర్పంచ్ ముత్తే శైలజ సుధాకర్ ఇంట్లో తేనేటీ విందును ఎమ్మెల్యే స్వీకరించారు. తిమ్మాపూర్ గ్రామ నాయకులు, కార్యకర్తల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జెండా వెంకటపూర్ పల్లె దవాఖానను కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డీపీఓ కిషన్, సర్పంచ్ ఎల్తాపు సుధాకర్,తహసీల్దార్ దిలీప్ కుమార్, ఏంపీడీఓ అనిల్,సర్పంచ్ లు నలిమేల రాజు, దుమ్మని సత్తన్న,రాందాస్,ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మాజీ మండలాధ్యక్షుడు పింగళి రమేష్,నాయకులు దొంత నర్సయ్య,పూర్ణ చందర్ రావు,కందుల మోహన్,బొప్పు సుమన్,పంచాయితీ కార్యదర్శి హరి కృష్ణ, ఉప సర్పంచ్ విజయలక్ష్మి,వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు