చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

22-11-2026 | 06:23pm

చేగుంట, నవంబర్ 22:  విజయక్రాంతి : చేగుంట మండలంలోని(Chegunta Mandal) చందాయిపేట గ్రామ పరిధిలో గల దేవుని చెరువులో(Deveni Cheruvu lake) చేపల వేటకు వెళ్లి  ప్రమాదవశాత్తు మృతి(Accidental death) చెందిన సంఘటన చోటుచేసుకుంది. చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి(Chegunta SI Chaitanya Kumar Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా(Siddipet District) దౌల్తాబాద్ మండలం చేట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన పసుల ఆంజనేయులు (55)సోమవారం రాత్రి సమయంలో చేపలు పట్టేందుకు వల తీసుకొని దేవుని చెరువులోకి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చేపల వలలు కాలు చిక్కుకొని చెరువులో  నీటిలో మునిగి మృతి చెందాడు.

మరిన్ని వార్తలు