అంబులెన్స్‌లోనే మహిళ ప్రసవం
సమయస్ఫూర్తితో ప్రసవం చేసిన ఈఎంటీ బాలరాజు, పైలట్ విజయ్
బాలరాజు, విజయ్ లకు ప్రశంసల వెల్లువ
భూపాలపల్లి టౌన్, నవంబర్ 22 ( విజయక్రాంతి ) : 108 అంబులెన్సులోనే(Ambulance) మహిళ ప్రసవించిన ఘటన భూపాలపల్లిలో(Bhupalpally) చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం జంగేడు గ్రామానికి చెందిన ఏగిడి చరణ్ భార్య లాస్య (22) పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే గణపురం 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ బాలరాజు, పైలట్ విజయ్ హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.
లాస్యను అంబులెన్స్‌లో ఆసుపత్రికి(Hospital) తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు తీవ్రం కావడంతో పరిస్థితిని గుర్తించి వారు సమన్వయంతో వ్యవహరించి అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించగా లాస్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లిబిడ్డలను మెరుగైన వైద్య సేవల(medical services) నిమిత్తం భూపాలపల్లిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి(Government General Hospital) తరలించారు. అత్యవసర సమయంలో సుఖ ప్రసవం చేయించి తల్లిబిడ్డల సంరక్షణకు తోడ్పడిన 108 సిబ్బంది బాలరాజు, విజయ్‌లకు లాస్య కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవల పలువురు ప్రశంసలు కురిపిస్తూ అభినందించారు.