మెడికో ఆత్మహత్య

28-09-2026 | 10:01pm

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): ఎంబీబీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక మానసిక వేదనకు గురైన ఓ విద్యార్థి అధిక మోతాదులో మందులు తీసుకుని ఆత్మహత్య(commits suicide)కు పాల్పడ్డాడు.  కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపిన కథనం మేరకు  కృష్ణా జిల్లా తాడిగడప గ్రామానికి చెందిన లారీ మెకానిక్ కుమారుడు నాగడి పునీత్ వర్మ (28)కు 2019 సంవత్సరంలో కౌన్సెలింగ్ ద్వారా ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు లభించింది.  కరీంనగర్‌(Karimnagar)లోని బొమ్మకల్ ప్రాంతంలో ఉన్న చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల(Institute of Medical Sciences College)లో ఎంబీబీఎస్‌లో చేరాడు.

2025 సంవత్సరంలోనే ఎంబీబీఎస్ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, పునీత్ వర్మకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉండటంతో కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. కుమారుడి మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతని తల్లిదండ్రులు శంకర్ బాబు  భార్య తో సహా కృష్ణా జిల్లా నుంచి కరీంనగర్‌కు వచ్చి,  గుంటూరుపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని  ఉంటున్నారు.

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక మానసిక వేదనతో పునీత్ వర్మ అధిక మోతాదులో బెంజోడియాజిపైన్‌ తరహా మాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు