భిక్కనూర్‌లో ముమ్మరంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు
25-09-2026 | 12:59pm
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Bhiknoor Primary Health Center) పరిధిలోని అన్ని గ్రామాల్లో డాక్టర్ యేమిమ ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను(Friday Dry Day events) ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులపై ఆశా, ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చని ప్రజలకు వివరిస్తున్నారు.