నాటు బాంబుల కలకలం

01-11-2026 | 07:20pm

నాటు బాంబులు పేలి ఏడుగురికిక గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఘటన 

కామారెడ్డి, నవంబరు 01 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆదివారం నాటు బాంబులు పేలి ఆరుగురు గాయపడిన ఘటన కలకలం రేపుతుంది. అటవీ పందుల వేట కోసం బాన్సువాడలోని ఎర్రమనుకున్న ప్రాంతంలో నివసిస్తున్న దాసరి లక్ష్మయ్య అడవిపందులను వేటాడేందుకు బైకుపై నాటు బాంబులను తీసుకెళ్లే ప్రయత్నంలో పేలి ఏడుగురు గాయపడ్డారు.

వేటకు వెళ్లే ముందు లక్ష్మయ్య నాటుబాంబులు సరిగా పేలుతాయా లేదా అని చూసేందుకు ప్రయత్నించిన సమయంలో ఒక నాటు బాంబు పేలడంతో మరికొన్ని నాటు బాంబులు పేలి బాన్సువాడ ప్రజలను భయకం పీతులను చేశాయి. వేట కోసం తీసుకొచ్చిన నాటు బాంబులు పేలడంతో ఏడుగురికి గాయాలు కాగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని బాన్సువాడ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఒకేసారి నాటు బాంబులు పేలడంతో బాన్స్వాడ ప్రజలు ఉలిక్కిపడ్డారు.

గాయపడ్డ వారిలో లక్ష్మయ్య, వెంకయ్య, రాజు, రమేష్, ముగ్గురు బాలికలు వైశాలి, శ్రీదేవి, అంజలి,  లు ఉన్నారు. వీరిలో శ్రీదేవి, అంజలి, రమేష్ ల పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వివరాలు సేకరిస్తున్నారు. బాన్సువాడ డివిజన్లో అడవి పందుల వేటకు నాటు బాంబులు ఉపయోగిస్తుండడం సర్వసాధారణమని తెలుస్తుంది. పోలీసుల నిఘా వైపల్యం వల్లే వన్య ప్రాణుల వేట కొనసాగుతుంది. వన్యప్రాణుల వేట కోసం నాటు బాంబు లు వేటగాళ్లు వినియోగిస్తున్నారు. బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగి సేకరిస్తున్నారు. నాటు బాంబుల పేలుడు కలకలం కామారెడ్డి జిల్లాలో ఉలిక్కి పడేలా చేసింది.

మరిన్ని వార్తలు