అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఇంటికి చేరాలి
కొత్తపల్లి, నవంబర్ 01 (విజయక్రాంతి): భారతదేశ చరిత్రలో కోట్లాది అణగారిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం(Telangana Ambedkar Youth Association) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ అన్నారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో ప్రతి ఆదివారం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి కృతజ్ఞతా పూర్వకంగా పూలమాల అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంబేద్కర్ గారికి పూలమాల వేయడం మా బాధ్యత మాత్రమే కాదు, ఆయన ఆశయాలను భావితరాలకు అందించడం మా లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కొరివి వేణుగోపాల్, గజ్జల ఆనందరావు సద్గురు రవీందర్, నిరుకుల్లా అనిల్, తపట్ల అంజయ్య, పాటకుల బూమయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.