ఆకుల ప్రభాకర్ సేవలు మరువలేనివి

01-11-2026 | 08:08pm

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

ముకరంపుర, నవంబర్ 1 (విజయక్రాంతి): వైద్య విధాన పరిషత్ విభాగంలో చీఫ్ ఫార్మసీ ఆఫీసర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందిన ఆకుల ప్రభాకర్ సేవలు అభినందనీయమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) అన్నారు. కరీంనగర్ లో ఆదివారం ఆకుల ప్రభాకర్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభాకర్‌ను సత్కరించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదవీ విరమణ అనేది ఉద్యోగ బాధ్యతల నుంచి విశ్రాంతి పొందే సందర్భమేమని.. ఉద్యోగ జీవితం అనంతరం కుటుంబంతో ఆనందంగా గడుపుతూ, సమాజసేవకు శేష జీవితాన్ని వినియోగించాలని సూచించారు. ఆకుల ప్రభాకర్ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు