కొనసాగుతున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్
క్షేత్ర పర్యటనలో భాగంగా కోటగుళ్ళు సందర్షణ
గణపురం, నవంబర్ 1 (విజయక్రాంతి): వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్(World Heritage Campaign)లో భాగంగా గణపురం మండల కేంద్రంలోని కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం(కోటగుళ్లు)ను పరిశోధక బృందం సందర్శించింది. ప్రొఫెసర్ పాండురంగారావు నేతృత్వంలోని బృంద సభ్యులు ఆలయాన్ని సందర్శించి దాని చారిత్రక విశిష్టత, నిర్మాణ శైలి, శిల్పకళా సంపద గురించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ పాండురంగారావు ఆలయ ప్రాముఖ్యత, కాకతీయుల కాలం నాటి నిర్మాణ విశేషాలు, శిల్పకళా నైపుణ్యాన్ని బృంద సభ్యులకు వివరించారు. ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపదను ఆసక్తిగా తిలకించిన పరిశోధకులు వాటిని ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో ఇంటాక్ (INTACH) ప్రతినిధి శ్రీధర్ రావు, పురావస్తు శాఖ ఫోర్‌మెన్ బాబు, సెక్యూరిటీ సిబ్బంది నల్లగొండ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.