పాపన్నపేటలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు..
* సర్పంచులు, నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు
* రోగులకు పండ్లు పంపిణీ, వనదుర్గమ్మ చెంత ప్రత్యేక పూజలు
పాపన్నపేట: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్(MLA Mynampally Rohit) జన్మదిన వేడుకలు పాపన్నపేటలోని చౌరస్తా వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఏడుపాయల్లో పార్టీ శ్రేణులు రోహిత్ పేరున వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.